Abn logo
Aug 1 2020 @ 15:56PM

సుశాంత్ డబ్బుతో రియా ఫ్యామిలీ పార్టీలు చేసుకునేది: సుశాంత్ బాడీగార్డ్

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సుశాంత్ ఆత్మహత్య ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని దేశం మొత్తం కోరుకుంటోంది. సుశాంత్‌ ఆత్మహ్యతకు రియా చక్రవర్తి కారణమని ఆరోపిస్తూ జూలై 25న సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు కూడా రియాపై విమర్శలు గుప్పించారు. 


తాజాగా సుశాంత్ బాడీగార్డ్ కూడా రియాపై విమర్శలు చేశాడు. `అనారోగ్యం కారణంగా సుశాంత్ ఎక్కువ సమయం నిద్రపోయేవాడు. ఆ సమయంలో రియా చక్రవర్తి, ఆమె తండ్రి, సోదరుడు తమ స్నేహితులను సుశాంత్ అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించి పార్టీలు చేసుకునేవారు. సుశాంత్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టుకునేవార`ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక, సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ తీరుపై కూడా సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. జూలై 25 వరకు రియాకు వ్యతిరేకంగా మాట్లాడిన సిద్ధార్థ్.. ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించాడని, ఈ కేసు విషయంలో అతని పాత్రను పోలీసులే బయటపెడతారని వికాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement