Abn logo
Aug 2 2020 @ 05:33AM

బాలీవుడ్ మాఫియా ఒత్తిడిలో ఉద్ధ‌వ్‌: సుశీల్ మోదీ

ప‌ట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రాజకీయ జోక్యం అంత‌కంత‌కూ పెరుగుతోంది. తాజాగా బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. బాలీవుడ్ మాఫియా ఒత్తిడిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాక్రే ఉన్నారని సుశీల్ మోదీ ఆరోపించారు. బీహార్‌కు చెందిన‌ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తు చేయడానికి వచ్చిన బీహార్ పోలీసులకు ముంబై పోలీసుల స‌హ‌కారం లభించడం లేదని సుశీల్ మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉద్ధవ్ ధాక్రే కాంగ్రెస్ పెంచిపోషిస్తున్న‌ బాలీవుడ్ మాఫియా ఒత్తిడిలో ఉన్నారు. అందుకే సుశాంత్‌ కేసులో బాధ్యులైన వారిని సేవ్ చేయడానికి మొగ్గు చూపుతున్నార‌ని వ్యాఖ్యానించారు. కాగా వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఆరోపణలు కోట్లాది బిహారీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేప‌ధ్యంలో అన్ని పార్టీలు ఈ విషయంపై సీబీఐ విచారణను కోరుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement