Abn logo
Sep 17 2020 @ 09:22AM

నార్కోటిక్సు కంట్రోల్ బ్యూరో అధికారికి కరోనా

సుశాంత్ సింగ్ కేసులో మాజీ మేనేజరు శ్రుతి దర్యాప్తునకు ఆటంకం 

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్సు కంట్రోల్ బ్యూరో అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ కేసులో నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజరు శ్రుతి మోదీ, టాలెంట్ మేనేజరు జయసాహాను నార్కోటిక్సు కంట్రోల్ బ్యూరో అధికారులు బుధవారం ప్రశ్నించారు. అయితే వీరిని ప్రశ్నించిన నార్కోటిక్సు కంట్రోల్ బ్యూరో అధికారి ఒకరికి కొవిడ్ -19 పాజిటివ్ అని తేలడంతో విచారణను నిలిపివేసి సుశాంత్ సింగ్ మాజీ మేనేజరు శ్రుతిని ఇంటికి పంపించారు. 

సుశాంత్ మరణ కేసులో డ్రగ్స్ కు సంబంధించి ముంబై కోర్టు కరంజీత్ సింగ్, డ్వేన్ ఫెర్నాండెజ్, అంకుష్ అన్రేజాలను జుడీషియల్ కస్టడికి పంపించింది. డ్రగ్స్ కేసులో ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతానికి చెందిన కరంజీత్ సింగ్ ను నార్కోటిక్సు కంట్రోల్ బ్యూరో అధికారులు గత వారం అరెస్టు చేశారు.కాగా సుశాంత్ మృతదేహం ఉంచిన ఆసుపత్రి మార్చూరీని నటి రియాచక్రవర్తి సందర్శించలేదని మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూపర్ ఆసుపత్రి, పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చింది. పోస్టుమార్టం గదిలో అపరిచితులు, ఇతర వ్యక్తులను అనుమతించలేదని ఓ అధికారి స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement