Abn logo
Jul 8 2020 @ 03:09AM

కావాలని తప్పించలేదు

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై బాంద్రా పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. పలు ప్రొడక్షన్‌ హౌస్‌లతో సుశాంత్‌ ఒప్పందాలు.. ఆగిపోయిన సినిమాల కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంజయ్‌లీలా భన్సాలీను మంగళవారం దాదాపు 5 గంటలపాటు విచారించి ఆయన  ేస్టట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. అయితే సుశాంత్‌కు నాలుగు చిత్రాల్లో అవకాశమిస్తానని ఆశ చూపి కావాలనే ఆ చిత్రాల నుంచి తప్పించారన్న పోలీసుల ప్రశ్నలను భన్సాలీ ఖండించారు. ‘‘నాలుగు సినిమాల్లో సుశాంత్‌కు ఆఫర్‌ ఇచ్చిన మాట వాస్తవం. అందులో రెండు సినిమాల్లో అత్యంత కీలక పాత్రలు. వాటి కోసం తను కూడా ఆతురతగా ఎదురు చూశాడు. కానీ అదే సమయంలో వేరే బ్యానర్‌లో కాంట్రాక్ట్‌ ఉండటం వల్ల నాకు సినిమాలకు సమయం కేటాయించలేకపోయాడు. అందుకే అతనికి బదులు వేరే కథానాయకుడిని తీసుకోవలసి వచ్చింది. అంతేకానీ నేను కావాలని అతన్ని తప్పించలేదు’’ అని భన్సాలీ తెలిపారు. ఇప్పటికే ఈ కేస్‌ విషయంలో కుటుంబసభ్యులు, స్నేహితులు సహా నటులతో కలిపి 34 మందిని విచారించి వారందరి స్టేట్‌మెంట్‌లను పోలీసులు రికార్డ్‌ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement