Oct 24 2021 @ 11:23AM

మరోసారి సూర్య - సుధ కొంగర కాంబో..?

మరోసారి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లేడీ డైరెక్టర్ సుధ కొంగర కాంబినేషన్ రిపీట్ అవబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్‌లో 'సూరారై పోట్రు' అనే సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇదే సినిమా తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అంటూ వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఇప్పుడు మరోసారి సుధ కొంగర సూర్యను డైరెక్ట్ చేయబోతోందట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు ముగిశాయని సమాచారం. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సూర్య.. సుధ కొంగరతో ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రకటించనున్నాడో చూడాలి. కాగా ఇటీవల సూర్య నటిస్తున్న 'జై భీమ్' మూవీ టీజర్ వచ్చి బాగా ఆకట్టుకుంటోంది.