Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్ ఏడు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-30T13:14:45+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 87,273 క్యూసెక్కులుగా

Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్ ఏడు గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 87,273 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 81,162 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం: 33.22 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం: 175 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం : 166.23 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-09-30T13:14:45+05:30 IST