సూర్యాపేట: జిల్లాలోని హుజుర్‌నగర్‌లో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సన్నిధి సాయి(22) అనే డిగ్రీ విద్యార్థి పెట్రోల్ పోసుకొని బాత్ రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు దైవదర్శనానికి వెళ్లి వచ్చేసరికి సాయి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.