కోడి పందాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సూర్యనారాయణరెడ్డి

ABN , First Publish Date - 2022-01-14T20:55:09+05:30 IST

జిల్లాలో సంక్రాంతి పర్వదినాల్లో జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కోడి పందేలు

కోడి పందాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సూర్యనారాయణరెడ్డి

ఏలూరు: జిల్లాలో సంక్రాంతి పర్వదినాల్లో జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీలు, అశ్లీల నృత్యాలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనపర్తి మండలం దుప్పలపూడిలో కోడి పందాలను ఎమ్మెల్యే డా.సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు. రాజోలులో యథేచ్ఛగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. కోడి పందాలతో పాటు జోరుగా గుండాట, లక్షల్లో బెట్టింగులు పెడుతున్నారు. మండపేట మండలం ద్వారపూడిలోనూ జోరుగా కోడిపందాలు ప్రారంభమయ్యాయి. 


పోలీసుల సాక్షిగా మూడ్రోజులపాటు పందెంరాయుళ్లు పేట్రేగిపోనున్నారు. పందేలతోపాటు పేకాట పోటీలు, గుండాట, రికార్డింగు డ్యాన్సుల వంటివి నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అధికార వైసీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల సంపూర్ణ సహకారం పండుగ మూడు రోజులు జూద క్రీడలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. కొన్ని ప్రాంతాల్లో అధికార వైసీపీలోని ద్వితీయశ్రేణి నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా శాంతి భద్రతలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు పందేలతోపాటు ప్రభల తీర్థంపై కొవిడ్‌ ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది.


Updated Date - 2022-01-14T20:55:09+05:30 IST