ఉద్యోగులు రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయారు: సూర్యనారాయణ

ABN , First Publish Date - 2022-02-04T20:43:30+05:30 IST

రాష్ట్రంలో ఉద్యోగులు రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయారని స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ అన్నారు.

ఉద్యోగులు రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయారు: సూర్యనారాయణ

విజయవాడ: రాష్ట్రంలో ఉద్యోగులు రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయారని, వేతన సవరణ తేదీకి.. అమలు తేదీకి ప్రభుత్వాలు వ్యత్యాసం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ అన్నారు. నిన్న ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంతో శుక్రవారం స్టీరింగ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ మధ్యంతర భృతి వెనక్కు తీసుకోలేదన్నారు. మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పు అని తమకు తెలీదన్నారు. మధ్యంతర ఉపశమనం ఏ రకంగా రుణంగా కనిపించిందో అధికారులు చెప్పాలన్నారు. ఐఏఎస్‌లు చదివిన గొప్ప చదువులు తాము చదవక పోయినా ఇది సాధారణ లెక్కలేనని ప్రతీ ఉద్యోగికి తెలుసన్నారు. ఐఆర్ జీవోలో ఒక తరహాగా గత పీఆర్సీలో ఒకలా ఉండటం తప్పుదోవ పట్టించడమేనన్నారు. జీవోను నిలుపుదల చేయాలని చెప్పినా... అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు. అవగాహన రాహిత్యం ఎవరిదో... అధికారులే అర్థం చేసుకోవాలన్నారు.


అనామలిస్ కమిటీ అంటే సాధారణంగా చేయాల్సిన దాని కంటే భిన్నంగా ఉన్నవాటిని పరిష్కరించడానికేనని, దానికి భిన్నంగా ప్రభుత్వం ఆలోచిస్తోందని సూర్యనారాయణ అన్నారు. కేంద్ర పే కమిషన్‌కు వెళ్తామని చెప్పడాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పీఆర్సీ అమలు విషయంలో మూల వేతనం నిర్దారించే విషయంలో కేంద్రం నిర్దారించిన  సిఫార్సులు ఆచరణలోకి తీసుకున్నారా? లేదా చెప్పాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-04T20:43:30+05:30 IST