Abn logo
May 19 2020 @ 13:33PM

నాలుగోసారి ఆ ద‌ర్శ‌కుడితో సూర్య‌!!

త‌మిళ‌, తెలుగు సినీ ఇండ‌స్ట్రీల్లో మార్కెట్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న హీరోగా న‌టించిన ‘ఆకాశం నీ హ‌ద్దురా’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. అలాగే హ‌రి ద‌ర్శ‌క‌త్వంలోనూ ‘అరువా’ అనే సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య సినిమా చేయ‌బోతున్నారు. తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య సినిమా చేయ‌బోతున్నార‌ట‌. ఇంత‌కు ముందు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ‘వీడొక్క‌డే’, ‘బ్ర‌ద‌ర్స్‌’, ‘బందోబ‌స్త్’ చిత్రాలు రూపొందాయి. అంతా ఓకే అయితే.. నాలుగోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement