Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 29 Jun 2022 13:45:35 IST

ఆస్కార్ అకాడమీ నుంచి Surya కు ఆహ్వానం

twitter-iconwatsapp-iconfb-icon

సౌత్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుల్లో సూర్య (Surya) ఒకరు. విభిన్నతరహా కథాంశాలు, విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామాస్, హారర్ ..ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని జోనర్స్ లోనూ సూర్య నటించి మెప్పించారు. ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడని సూర్య నుంచి రీసెంట్ గా ‘ఆకాశం నీహద్దురా, జైభీమ్’ అనే ఆణిముత్యాల్లాంటి సినిమాలు వచ్చాయి. ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండూ సామాజిక కథాంశాలతో తెరకెక్కాయి. వీటిలో జైభీమ్ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ కు కూడా వెళ్ళింది. కానీ దురదృష్టవశాత్తు రేసులో నిలబడలేకపోయింది. దాంతో సూర్య అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. అయితే ఇప్పుడు మరోరకంగా అభిమానులు గర్వపడే వార్తొకటి వచ్చింది. 

సూర్యకు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దాంతో సౌత్ ఇండియా హీరోల్లో సూర్యకి దక్కిన గౌరవం ఇంతకు ముందు మరెవరికీ దక్కలేదని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. 1988 లో చిరుకి ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ కు ఆహ్వానం అందింది. అప్పట్లో ఈ వార్త సంచలనమైంది. ఆ తర్వాత మళ్లీ అలాంటి ఆహ్వానం అందుకున్న మరో హీరోగా సూర్య ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. అయితే ఈ సారి సూర్యకి ఆహ్వానం దక్కింది అస్కార్ అవార్డుల ఫంక్షన్ కు కాదని తెలుస్తోంది. 2022 ఆస్కార్ అవార్డు కార్యక్రమం ఆర్గనైజర్స్ కమిటీలో 397మందికి సభ్యత్వం ఇచ్చారు. ఆ జాబితాలో సూర్యకు కూడా చోటు దక్కింది. 

ఇలా ఆస్కార్ అవార్డ్ ఆర్గనైజర్స్ కమిటీలో మెంబర్ షిప్ దక్కించుకొన్న సౌత్ స్టార్ సూర్యమాత్రమే. 2021 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన సినిమాల్లోని నటీనటులకు ఈ మెంబర్ షిప్ దక్కుతుంది. అలా సూర్య పేరు ఆస్కార్ అవార్డుల సందర్భంగా మారుమాగుతోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సారైనా సూర్య ఆస్కార్ కు ఆస్కారం ఉన్న ఓ అద్భుత సినిమాలో నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement