తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ హీరోల్లో సూర్య ఒకరు. అందుకనే ఈయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శూరరై పోట్రు’ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. కాగా.. సూర్య తదుపరి చిత్రాన్ని హరి దర్శకత్వంలో చేయాలనుకున్నారు. ఈ చిత్రానికి ‘అరువా’ అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. తర్వాత అసురన్ ఫేమ్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. అయితే తాజా కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు సూర్య హరి సినిమా కంటే ముందుగానే వెట్రి మారన్ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. కరోనా ప్రభావం లేకుండా ఉండుంటే సూర్య అన్నీ తన ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్లేవారు. మరిప్పుడు ఏం చేస్తారో చూడాలి.