నీటి సంరక్షణతోనే మనుగడ

ABN , First Publish Date - 2022-06-26T05:58:51+05:30 IST

నీటి వృథాను అరికడుతూ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడంపైనే మనుగడ ఆధారపడి ఉంటుందని జలశక్తి అభియాన్‌ బృందం డీఎస్‌.హాన్స్‌రాజ్‌ మీనా, డాక్టర్‌ మణీవన్నన్‌ పేర్కొన్నారు.

నీటి సంరక్షణతోనే మనుగడ
మల్యాలలో ఇంకుడు గుంత పరిశీలిస్తున్న కేంద్ర బృందం

మల్యాల, జూన్‌ 25: నీటి వృథాను అరికడుతూ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడంపైనే మనుగడ ఆధారపడి ఉంటుందని జలశక్తి అభియాన్‌ బృందం డీఎస్‌.హాన్స్‌రాజ్‌ మీనా, డాక్టర్‌ మణీవన్నన్‌ పేర్కొన్నారు. మం డలంలోని తాటిపెల్లి, ముత్యంపేట, ఓబులాపూర్‌లో శనివారం పర్యటించి జలశక్తి అభియాన్‌ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, రీచార్జీ బోర్‌వెల్స్‌ పనితీరు తెలుసుకున్నారు. ఓబులా పూర్‌లో అమృత్‌ సరోవర్‌ కార్యక్రమంలో భాగంగా చెరువులో పూడిక తీత చేపట్టగా అందులోకి సమృద్ధిగా నీళ్లు చేరుకోవడంతో సంతృప్తి వ్యక్తం చే శారు. ముత్యంపేటలో నూతన గ్రామపంచాయితీ భవనాన్ని సందర్శిం చారు. కేంద్ర బృందంను సర్పంచ్‌ తిరుపతిరెడ్డి సత్కరించారు. గ్రామం లో చేపట్టిన పలు అభివృద్ది పనులను పరిశీలించారు. వారి వెంట అడి షనల్‌ పీడీ నరేశ్‌, ఏపీడీ శివాజీ, ఎంపీడీవో శైల జారాణీ, సర్పంచ్‌లు జ్యో త్స్న, తిరుపతిరెడ్డి, సరోజన ఏపీవో శ్రీనివాస్‌, ఈసీ మనోజ్‌, టీఏలు జలపతిరెడ్డి, లావణ్య ఉన్నారు.


Updated Date - 2022-06-26T05:58:51+05:30 IST