సర్వేలు టీఆర్ఎస్‌కే అనుకూలంగా వచ్చాయి: ఎర్రబెల్లి దయాకరరావు

ABN , First Publish Date - 2022-06-23T00:15:38+05:30 IST

Telangana: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కేంద్ర ప్రభుత్వ ధోరణిపై విమర్శలు గుప్పించారు. కేంద్రం తమ ప్రభుత్వాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని

సర్వేలు టీఆర్ఎస్‌కే అనుకూలంగా వచ్చాయి: ఎర్రబెల్లి దయాకరరావు

Telangana: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కేంద్ర ప్రభుత్వ ధోరణిపై విమర్శలు గుప్పించారు. కేంద్రం తమ ప్రభుత్వాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడగలిగామని చెప్పారు. ఇటీవల జరిపిన ఎన్నికల సర్వేలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వచ్చాయని తెలిపారు.

 ‘‘పల్లె ప్రగతి కార్యక్రమంలో మా అధికారులు పాల్గొనకుండా చేశారు’’

‘‘రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపు ధోరణితో ఉంది. పల్లె ప్రగతి కార్యక్రమం నడుస్తున్న సమయంలో 6 జిల్లాలలో కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు తనిఖీలు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో మా అధికారులు పాల్గొనకుండా చేశారు. కేంద్రం కావాలనే ఈజీఏస్ నిధులను నిలిపివేసింది. కేంద్రం నుండి రూ.800 కోట్ల నిధులు ఇంకా రావాలి.  అక్కడి నుండి నిధులు తేవడం చేతకాని బీజేపీ ఎంపీలు అడ్డగోలుగా ఆరోపిస్తున్నారు. బీజేపీ నాయకులు ఎన్ని ఎత్తులు వేసినా .. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం అయింది. ’’ అన్నారు. 


‘‘ఈ మధ్యకాలంలో జరిపిన సర్వేలు అన్ని టీఆర్ఎస్‌కే అనుకూలంగా వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు మాకు ఎక్కడ పోటీ కాదు.రారు. రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. బీజేపీ నేతలు మూర్ఖులు. వాళ్ళు ప్రాంతీయ పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది.’’ అని పేర్కొన్నారు.  

Updated Date - 2022-06-23T00:15:38+05:30 IST