ఏసీబీ వలలో సర్వేయర్‌

ABN , First Publish Date - 2022-01-28T05:54:57+05:30 IST

కళ్యాణదుర్గం మండల సర్వేయర్‌ హేమసుందర్‌ ఓ మహిళ నుం చి రూ.1.40 లక్షలు తీసుకుంటూ గురువారం రాత్రి ఏసీబీకి పట్టుబడ్డారు.

ఏసీబీ వలలో సర్వేయర్‌
ఏసీబీకి పట్టుబడిన సర్వేయర్‌ హేమసుందర్‌

స్థలం సబ్‌ డివిజనకు లంచం డిమాండ్‌ 

రూ.1.40 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం 

 కళ్యాణదుర్గం, జనవరి 27: కళ్యాణదుర్గం మండల సర్వేయర్‌ హేమసుందర్‌ ఓ మహిళ నుం చి రూ.1.40 లక్షలు తీసుకుంటూ గురువారం రాత్రి ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ ఏఎ్‌సపీ కులశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు, కుందుర్పి మండల కేం ద్రానికి చెందిన జయమ్మకు కళ్యాణదుర్గం పట్ట ణ సమీపంలో 43 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలాన్ని సబ్‌ డివిజన చేసేందుకు సర్వేయర్‌ను సంప్రదించగా రూ.2 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో బేరమాడిన జయమ్మ రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ముందుగా రూ.10 వేలు అడ్వాన్సు ఇచ్చారు. అనంతరం ఏసీబీ డీజీకి వాట్సా్‌పలో ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్నారు. వారి సూచనల మేరకు పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఉన్న సర్వేయర్‌ ఇంటికి వెళ్లిన బాధితురాలు, ఆయనకు రూ.1.40 లక్షలు ఇచ్చారు. ఆ వెంటనే ఏసీబీ డీఎస్పీ శివనారాయణ, సీఐలు ప్ర భాకర్‌, మోహనప్రసాద్‌, శివగంగాధర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రభూపతి దాడులు నిర్వహించి సర్వేయర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. రిమాండ్‌కు పంపుతామని తెలిపారు. సర్వేయర్‌ అక్రమ సంపాదన గురించి విచారిస్తామన్నారు.

Updated Date - 2022-01-28T05:54:57+05:30 IST