విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై సర్వే

ABN , First Publish Date - 2022-05-18T05:57:58+05:30 IST

జిల్లా కేంద్రం భీమవరంలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో ముందుకు వచ్చిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి ఒక క్రమపద్దతిలో ఏర్పాటు చేసేందుకు మునిసిపల్‌, విద్యుత్‌ శాఖ అధికారులు జాయింట్‌ సర్వే చేపట్టారు.

విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై సర్వే

భీమవరం టౌన్‌, మే 17 : జిల్లా కేంద్రం భీమవరంలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో ముందుకు వచ్చిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి ఒక క్రమపద్దతిలో ఏర్పాటు చేసేందుకు మునిసిపల్‌, విద్యుత్‌ శాఖ అధికారులు జాయింట్‌ సర్వే చేపట్టారు. ఆక్రమణల తొలగింపుకు చేప ట్టిన 11 రోడ్లలో తొలగించాల్సిన స్తంభాల ను గుర్తిస్తున్నారు. జువ్వలపాలెం రోడ్డులో అధికారులు సర్వే చేస్తున్నారు. మునిసిపాలిటీ వీధి దీపాలకు సంబంధించి వేసిన స్థంభాలను లెక్కిస్తున్నారు. ఆక్రమణలు తొలగించిన రోడ్లలపై రోడ్డు మార్జిన్‌లను తిరిగి ఆక్రమించకుండా తగిన చర్యలు తీసుకోనున్నారు. డ్రెయిన్‌ వద్ద నుంచి రోడ్డు వరకు మధ్యలో ఫెవర్‌ బ్రిక్స్‌తో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం జువ్వలపాలెం రోడ్డుకు సంబంధించి రెండు వైపులా ఫెవర్స్‌తో రోడ్డు వేసేందుకు అంచనాలు సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2022-05-18T05:57:58+05:30 IST