రేపటి నుంచి చేయూత సర్వే

ABN , First Publish Date - 2020-06-28T10:36:29+05:30 IST

వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ఆగస్టు 12న ప్రారంభించనున్నారు.ఈ మేరకు లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియ సోమవారం నుంచి

రేపటి నుంచి చేయూత సర్వే

 సుమారు 1.60 లక్షల మంది మహిళలకు లబ్ధి


ఏలూరు, జూన్‌  27 (ఆంధ్రజ్యోతి) : వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ఆగస్టు 12న ప్రారంభించనున్నారు.ఈ మేరకు లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కాబోతోంది. వలంటీర్లు, సచివా లయ సిబ్బంది సర్వే చేసి అర్హులైన మహిళలను గుర్తిస్తారు. 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు కలిగి ఉండి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మహిళలకు నాలుగేళ్లలో రూ. 75 వేల ఆర్థిక సహాయం అందిస్తారు.తొలి ఏడాది లబ్ధిదారుకు రూ. 18,750లు అందజే స్తారు.జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షా 60 వేల మంది మహిళలకు లబ్ధి చేకూరే వీలుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం ప్రత్యేక యాప్‌ రూపొందించారు.


ఈ యాప్‌ ద్వారా అర్హులైన మహిళల వివరాలు నమోదు చేస్తారు. అర్హులైన మహిళలు ఖచ్చితంగా వయసు ధ్రువీకరణ పత్రంతో పాటు, కుల ధ్రువీకరణ పత్రాన్ని వలంటీర్లకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు జగనన్న తోడు పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా చిరు వ్యాపారులకు రుణ సహాయం అందించనున్నారు. జిల్లాలో సుమారు 70 వేల మంది అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరికి పెట్టుబడి నిమిత్తం ప్రతి ఏటా రూ.10వేల రుణ సహాయం అందిస్తారు. సకాలంలో రుణం చెల్లించినవారికి ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. రుణం చెల్లించనివారికి ఆ మరుసటి ఏడాది రుణ సహాయం అందించరు.


 అర్హులందరికీ సాయం : ఉదయ భాస్కర్‌, పీడీ

అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తాం.ఈ మేరకు సమగ్ర సర్వే  చేస్తున్నాం.తరువాత గ్రామాల్లో సోషల్‌ అడిట్‌ ద్వారా లబ్ధిదారుల తుది జాబితా రూపొందిస్తాం.అర్హులెవరైనా తమ పేరు లేదని భావిస్తే అధికా రుల దృష్టికి తీసుకు వచ్చి సమస్యను పరిష్కరించుకోవచ్చు. 

Updated Date - 2020-06-28T10:36:29+05:30 IST