జిల్లాలో స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టాలి

ABN , First Publish Date - 2020-10-20T05:40:31+05:30 IST

జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షలు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చల్లా మధుసూదనాచారి అన్నారు.

జిల్లాలో స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టాలి

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, అక్టోబరు 19: జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షలు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చల్లా మధుసూదనాచారి అన్నారు. సోమవారం గర్భస్థ పిండ నిర్ధారణ అడ్వైజరీ కమిటీ టెలికాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఖచ్చితంగా స్కానింగ్‌ సెంటర్లు రిజిస్ర్టేషన్లు చేసుకోవాలన్నారు. సమావేశంలో కమిటీ మెంబర్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్లు ప్రకాష్‌, గోపాల్‌రావు, దామోదర్‌, నవత, రమాదేవి, ఎస్‌.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T05:40:31+05:30 IST