Surrogacy: చులకనైన అమ్మతనం..అమ్మను అమ్మేస్తున్న సరోగసీ..

ABN , First Publish Date - 2022-08-06T21:42:04+05:30 IST

నాజూకు తనాన్నికోల్పోకూడదని.. అందాలను అమ్మతనం చెరిపేస్తుందనే వారు కూడా ఈ సరోగసీనే ఆశ్రయిస్తున్నారు.

Surrogacy: చులకనైన అమ్మతనం..అమ్మను అమ్మేస్తున్న సరోగసీ..

అమ్మను మించి దైవమున్నదా.. నిజమేకదా "అమ్మ.. సృష్టిలో అపురూపమైన వ్యక్తి". ఆమె పంచే మాతృత్వపు అనుభూతి మాటలలో చెప్పలేనిది. నవమాసాలు మోసి ఓ బిడ్డకు జన్మనివ్వడం అనేది ఆడదానికి సృష్టి అందించిన వరం. అమ్మకాబోతున్నానని తెలిసిన క్షణం ఎంతటి ఆనందానికి లోనవుతుందో..  తొమ్మిది మాసాలు మోసి, బిడ్డను ప్రసవించాకా.. ఆ బిడ్డే తన ప్రపంచంగా బ్రతుకుతుంది స్త్రీ.. 


మారుతున్న కాలంతో పాటు అమ్మతనమూ నెమ్మదిగా రూపు మార్చుకుంటుంది. అమ్మతనానికి Alternative గా మనదేశంలో మాత్రం ఐవీఎఫ్, “సరోగసీ” వంటి పద్ధతులు నెమ్మదిగా విస్తరిస్తున్న కల్చర్. సంతానం లేక ఇబ్బంది పడుతున్న జంటలు సరోగసీ పద్దతిని ఎంచుకుంటే... నాజూకు తనాన్నికోల్పోకూడదని.. అందాలను అమ్మతనం చెరిపేస్తుందనే వారు కూడా ఈ సరోగసీనే ఆశ్రయిస్తున్నారు. అమ్మతనం ఇప్పుడో బిజినెస్ గా మారుతోంది.


అద్దె గర్భం..ఆరోగ్య సమస్యలు ఉన్నవారి సంగతి సరేసరి..ప్రసవవేదన పడలేమని కొందరు, అందాలు తరిగిపోతాయని కొందరు సరోగసీ పద్దతిని ప్రోత్సహిస్తున్నారు. బిడ్డలు లేని వారు ఎవరినైనా దత్తత తీసుకోవాలన్నా ఆ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండటంతో సరోగేటెడ్‌ ప్రక్రియకు మొగ్గుచూపుతున్నారు.


Surrogate.. సరోగసీ ద్వారా పిల్లలు.. పిల్లలను కనాలనుకునే జంట నేరుగా కాకుండా మరొక స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకుని పిల్లలను కనే పద్ధతినే సరోగసీ అంటారు.  పురుషుడి వీర్యాన్ని మరొక మహిళ గర్భంలో ప్రవేశ పెడతారు. ఆ జంట కోసం పిల్లలను తన కడుపులో పెంచి, ప్రసవించే మహిళను సరోగేట్ మదర్ అంటారు. పిల్లలు కావాలనుకునే జంటలో..పురుషుడి వీర్యంతో బిడ్డను కనిపెంచిన మహిళ, బిడ్డకు బయోలాజికల్ మదర్ అయినప్పటికీ.. ప్రసవం అనంతరం ఆ స్త్రీకీ, బిడ్డకూ ఎటువంటి సంబంధం లేకుండా ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. 


Gestational surrogacy.. సరోగసీలో మరొక పద్ధతి కూడా ఉంది. జెస్టేషనల్ సరోగసీగా పిలిచే ఈ రెండో విధానంలో పిల్లలు కావాలనుకునే జంటలోని స్త్రీ అండాన్ని, పురుషుడి స్పెర్మ్‌తో ఫలదీకరణం చెందిస్తారు. అనంతరం ఆ పిండాన్ని సర్రోగేట్ యొక్క గర్భాశయంలో ఉంచుతారు. వైద్యుల పర్యవేక్షణలో సమయానికి ఆమె ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఎక్కువమంది జంటలు ఈ జెస్టేషనల్ సరోగసీని ఎంచుకుంటారు. ఈ పద్దతిలో ఎవరి అండం ద్వారా బిడ్డ జన్మించిందో వారిని బయోలాజికల్ పేరెంట్స్ గా పిలుస్తారు. బిడ్డపై సర్రోగేట్ మదర్ కు ఎటువంటి హక్కులు ఉండవు. కేవలం ప్రసవానికి, అద్దె గర్భానికి ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లిస్తారు.


సరోగేటెడ్‌ ప్రక్రియకు సంబంధించి మనకు ఎలాంటి చట్టాలు లేవు. కాకపోతే సరోగేట్ మధర్ విషయంలో కొన్ని నిబంధలు మాత్రం అమలులో ఉన్నాయి. బీదరికంలో మగ్గుతున్న కొందరి స్త్రీలు సరోగసీ పద్దతిని ఆర్థికమైన భరోసాగా ఎంచుకుని అనారోగ్యాల పాలవుతున్నారు. వీరి గురించి ప్రభుత్వాల స్పందన కూడా తక్కువగా ఉండటం వల్ల చాలా వరకూ స్త్రీ సంఘాలు వ్యతిరేకతను ఎక్కడో ఒకచోట నుంచి తెలుపుతూనే ఉన్నాయి. వారి హక్కుల గురించిన పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.


సరోగసీ గర్భాలకు నిబంధనలు ఇవే..

* సరోగసీ ప్రక్రియను నిర్వహించే క్లినిక్‌లు డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్ల రికార్డులు నిర్వహించాలి.

* సంతానం కావాలనుకునే దంపతులు, సరోగేట్‌ తల్లి మానసిక స్థితి సాధారణంగా ఉండాలి.

* సరోగేట్‌ తల్లికి గర్భాన్ని మోసేందుకు అయ్యే పూర్తిస్థాయి ఖర్చును సంతానం కావాలనుకుంటున్న దంపతులు చెల్లించాలి.

* ఈ ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా క్లినిక్‌ల దగ్గర ఉండాలి. కానీ వీటిలో క్లినిక్‌ ఎలాంటి జోక్యం చేసుకోకూడదు.

* ఆర్థికలావాదేవీలన్నీ కూడా దంపతులు, సరోగేట్‌ తల్లి మధ్యే కొనసాగాలి. క్లినిక్‌లు కేవలం వైద్య సేవలకు మాత్రమే ఛార్జీలు తీసుకోవాలి.

* సరోగెట్‌గా వ్యవహరించే తల్లుల కోసం క్లినిక్‌లు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వకూడదు.

* 30-40 ఏళ్ల మధ్య వయసున్నవారు మాత్రమే సరోగేట్‌ తల్లిగా వ్యవహరించాలి.

* సంతానం కావాల్సిన దంపతులకు జన్యు సంబంధం ఉన్నవారు, లేనివారు కూడా ఈ పని చేయొచ్చు.

* ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

* ముగ్గురికి పైగా సంతానం ఉన్నవారు సరోగేట్‌ తల్లిగా మారడానికి వీలులేదు.


ప్రపంచదేశాల్లో సరోగసి...

బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలో ఈ సరోగసీ పద్ధతి మీద ఎలాంటి ఆంక్షలు లేవు. దీని తో పాటూ భారత్, ఉక్రెయిన్, కాలిఫోర్నియాలలో కమర్షియల్ సరోగసీని అనుమతించారు. ఇక జర్మనీ, స్వీడన్, సర్వే, ఇటలీలలో సరోగసీని నిషేధించారు. 

Updated Date - 2022-08-06T21:42:04+05:30 IST