అసోంలో 246 మంది మిలిటెంట్ల లొంగుబాటు

ABN , First Publish Date - 2022-01-28T08:58:25+05:30 IST

యునైటెడ్‌ గోర్ఖా పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌(యూజీపీవో), తివా లిబరేషన్‌ ఆర్మీ(టీఎల్‌ఏ) గ్రూపులకు చెందిన 246 మంది మిలిటెంట్లు

అసోంలో 246 మంది మిలిటెంట్ల లొంగుబాటు

గువాహటి, జనవరి 27: యునైటెడ్‌ గోర్ఖా పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌(యూజీపీవో), తివా లిబరేషన్‌ ఆర్మీ(టీఎల్‌ఏ) గ్రూపులకు చెందిన 246 మంది మిలిటెంట్లు గురువారం జనజీవన స్రవంతిలో కలిశారు. యూజీపీవోకు చెందిన 169 మంది, టీఎల్‌ఏ గ్రూపునకు చెందిన 77 మంది అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో లొంగిపోయారు. వారు తమ వద్ద ఉన్న 277 తుపాకులు, 720 క్యాట్రిడ్జ్‌లు, గ్రనేడ్‌లను పోలీసులకు అప్పగించారు. బరాక్‌ లోయకు చెందిన బ్రూ రివొల్యూషనరీ ఆర్మీ యూనియన్‌(బీఆర్‌ఏయూ), యునైటెడ్‌ డెమోక్రటిక్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(యూడీఎల్‌ఎఫ్‌) సంస్థలకు చెందిన సభ్యులందరూ ఫిబ్రవరిలో లొంగిపోతారని పోలీసులు తెలిపారు. ఇక రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఉల్ఫా, కమ్తాపూర్‌ లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌(కేఎల్‌వో) మిలిటెంట్‌ గ్రూపులు మాత్రమేనని సీఎం హిమంత వెల్లడించారు.

Updated Date - 2022-01-28T08:58:25+05:30 IST