Jul 4 2021 @ 00:00AM

ఆశ్చర్యం, ఆనందం మౌనం...

ఆశ్చర్యం, ఆనందం, మౌనం... ఇలా  పలు భావోద్వేగాల్ని ముఖంలో పలికించారు బాలీవుడ్‌ కథానాయిక కట్రీనా కైఫ్‌. సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలను అభిమానులతో పంచుకోవడం కట్రీనాకు అలవాటు. విభిన్న భావోద్వేగాలకు లోనయినప్పుడు తను ఎలా కనిపిస్తానో తెలుపుతూ కొన్ని ఫొటోలను సరదాగా అభిమానులతో షేర్‌చేసుకున్నారు. పట్టరాని సంతోషానికి లోనయినప్పుడు తను ఎలా స్పందిస్తానో పై ఫొటోలో ఆమె చూపించారు. ప్రస్తుతం కట్రీనా విజయ్‌ సేతుపతి ‘మెర్రీ క్రిస్‌మస్‌’, షారూఖ్‌ఖాన్‌ ‘టైగర్‌ 3’ ‘ఫోన్‌ బూత్‌’ ‘సూపర్‌ సోల్జర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Bollywoodమరిన్ని...