సొంత ప్రజలతోనే మోదీ ప్రభుత్వం యుద్ధానికి దిగింది : సుర్జేవాలా

ABN , First Publish Date - 2020-05-30T21:27:37+05:30 IST

మోదీ యేడాది పాలనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘‘ఈ యేడాది అత్యంత నిరాశాజనకమైన యేడాది. అత్యంత విపత్తులతో

సొంత ప్రజలతోనే మోదీ ప్రభుత్వం యుద్ధానికి దిగింది : సుర్జేవాలా

న్యూఢిల్లీ : మోదీ యేడాది పాలనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘‘ఈ యేడాది అత్యంత నిరాశాజనకమైన యేడాది. అత్యంత విపత్తులతో కూడిన యేడాది. అత్యంత బాధతో కూడిన యేడాది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అభివర్ణించారు.


మోదీ ప్రభుత్వం సొంత ప్రజలతోనే యుద్ధానికి దిగిందని, గాయాలను మాన్పించాల్సింది పోయి వాటిపై మరింత కారం చల్లేలా మోదీ ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.‘‘మోదీ యేడాది పాలన భారత మాతకు గాయం చేసేలా ఉంది. ధనవంతుల పెట్టెలను నింపడానికి బీదా బిక్కి ప్రజలకు గాయాలు చేస్తోంది’’ అని విమర్శించారు.


ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ... మతతత్వ హింస పెరిగి, సోదరభావం దెబ్బతిన్నదని ఆయన విమర్శించారు. తాము కోవిడ్‌పై ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉందని ఆయన స్పష్టం చేశారు. వలస కార్మికుల విషయంలో కేంద్రానికి ఏమాత్రం స్పృహ లేదని వేణుగోపాల్ మండిపడ్డారు. 

Updated Date - 2020-05-30T21:27:37+05:30 IST