Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 14 Aug 2022 20:19:12 IST

Suriya: సినిమా కలెక్షన్స్ నుంచి భారీగా విరాళం అందించిన సూర్య

twitter-iconwatsapp-iconfb-icon

బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సూర్య (Suriya). ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఈ మధ్యనే అతడి నుంచి వచ్చిన సినిమా ‘ఎవరికీ తలవంచడు(ఈటి)’. ఈ మూవీ బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోయింది. సూర్య నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం ‘విరుమన్’ (Viruman). కార్తి (Karthi), అదితి శంకర్ (Aditi Shankar) హీరో, హీరోయిన్‌గా నటించారు. ముత్తయ్య (Muthaiya) దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో సూర్య నడిగర్ సంఘం భవనానికి మూవీ కలెక్షన్స్ నుంచి భారీ విరాళం అందించాడు. 


నడిగర్ సంఘం 6వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం తాజాగా జరిగింది. ఈ మీటింగ్‌కు సూర్య, కార్తి హాజరయ్యారు. నడిగర్ సంఘం బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ఫండ్‌కు సినిమా కలెక్షన్స్ నుంచి రూ. 25లక్షలను సూర్య విరాళంగా అందజేశాడు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నాజర్, వైస్ ప్రెసిడెంట్ కరుణాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే నేషనల్ అవార్డు గెలుచుకున్న సందర్భంగా మెంబర్స్ సూర్యను సత్కరిచారు. ‘విరుమన్’ ను  2-డీ ఎంటర్‌ టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఖైదీ-2’ కు సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌‌ను కార్తి అభిమానులతో పంచుకున్నాడు. ‘ఖైదీ-2’ (Kaithi 2) షూటింగ్ 2023లో ప్రారంభమతుందని చెప్పాడు. లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) విజయ్‌తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ‘ఖైదీ-2’ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని పేర్కొన్నాడు. ‘ఖైదీ-2’ లో రోలెక్స్ పాత్ర ఉంటుందో, లేదో తనకు తెలియదని తెలిపాడు. ప్రస్తుతానికీ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కష్టం అని వెల్లడించాడు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement