బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి మీరా మిథున్ కోలీవుడ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. పలువురు తమిళ సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తోంది. తన కెరీర్‌ను హీరోయిన్ త్రిష నాశనం చేసిందని మీరా ఇటీవల ఆరోపించింది. త్రిషకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువని, తనను తొక్కేయడానికి త్రిష ప్రయత్నించిందని వ్యాఖ్యానించింది. ఇక, కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, విజయ్ను మీరా తాజాగా టార్గెట్ చేసింది.
కోలీవుడ్‌లోని బంధుప్రీతి కారణంగానే విజయ్, సూర్య తెరపైకి వచ్చారని, వీరు తమ ఫ్యాన్స్‌ను కూడా కంట్రోల్ చేయలేరని, గాజులు తొడుక్కొని కూర్చుంటారని వ్యాఖ్యానించింది. మీరా వ్యాఖ్యలపై సామన్యులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఫైర్ అవుతున్నారు. నటి కస్తూరి, ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూర్యకు అండగా నిలిచారు. తాజాగా సూర్య ఈ వివాదంపై పరోక్షంగా స్పందించాడు. `తక్కువ స్థాయి విమర్శలకు స్పందించి విలువైన సమయాన్ని పాడు చేసుకోవద్దని నా సోదరసోదరీమణులను కోరుతున్నా. ఆ సమయాన్ని సమాజ శ్రేయస్సుకోసం వినియోగించండి. నాకు మద్దతు తెలిపిన భారతీరాజా సర్కి ధన్యవాదాల`ని సూర్య ట్వీట్ చేశాడు.