రెండేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స

ABN , First Publish Date - 2021-04-11T09:00:11+05:30 IST

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రెండేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్సను చేశారు. రాయలసీమ, నెల్లూరు,

రెండేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స

ఒకేసారి రెండు చెవులకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ


నంద్యాల, ఏప్రిల్‌ 10: కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రెండేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్సను చేశారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో మొట్టమొదటిసారిగా బధిర పిల్లలకు చేసే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీని ఒకేసారి రెండు చెవులకు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన చెన్నకేశవులు దంపతుల కుమారుడు సాత్విక్‌ వినికిడి  లోపంతో బాధపడుతున్నాడు. స్థానిక వైద్యులను సంప్రతించగా.. నంద్యాలకు చెందిన ఈఎన్‌టీ వైద్యుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ చిత్తలూరి మధుసూదన్‌రావు వద్దకు పంపారు.


ఈ నేపథ్యంలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీని చేయాలని నిర్ణయించారు. సాధారణంగా కాక్లియర్‌ సర్జరీలో సమస్యలు ఉత్పన్నమవుతాయని ఒక చెవికి సర్జరీ చేసిన తరువాత కొన్ని రోజులకు మరో చెవికి సర్జరీ చేస్తారు. ఆరోగ్యశ్రీలో ఇటీవల రెండు చెవులకు ఆపరేషన్‌కు అనుమతించడంతో ఒకేసారి రూ.13 లక్షల విలువైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీని చేసినట్టు డాక్టర్‌ మధుసూదన్‌రావు వెల్లడించారు. ఈనెల 9వ తేదీ సర్జరీ అనంతరం సాత్విక్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని తెలిపారు.

Updated Date - 2021-04-11T09:00:11+05:30 IST