చెఫ్స్‌గా మారిన రైనా, రాయుడు

ABN , First Publish Date - 2021-04-12T21:49:30+05:30 IST

క్రికెటర్లు సురేష్ రైనా, అంబటి రాయుడులను ట్యాగ్ చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ తన ఇన్‌స్టాగ్రాం పేజీలో రెండు ఫొటోలను షేర్ చేసింది. అందులో వాళ్లిద్దరూ చెఫ్ అవతారంలో కనిపించారు. టీషర్ట్, ఆప్రాన్ ధరించిన రైనా కుక్ చేస్తుండగా, మరో ఫొటోలో రాయుడు చెఫ్‌లతో కలిసి కనిపించాడు

చెఫ్స్‌గా మారిన రైనా, రాయుడు

చెన్నై: క్రికెటర్లు సురేష్ రైనా, అంబటి రాయుడులను ట్యాగ్ చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ తన ఇన్‌స్టాగ్రాం పేజీలో రెండు ఫొటోలను షేర్ చేసింది. అందులో వాళ్లిద్దరూ చెఫ్ అవతారంలో కనిపించారు. టీషర్ట్, ఆప్రాన్ ధరించిన రైనా కుక్ చేస్తుండగా, మరో ఫొటోలో రాయుడు చెఫ్‌లతో కలిసి కనిపించాడు. ఈ ఫొటోలకు ఓ తమిళ సినిమా పాటను కోట్ చేస్తూ ‘ఎన్నా సమయాలో’(ఏం వంటకం!) అని రాసుకొచ్చింది.


ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన క్రికెటర్లు ఏం వంట చేస్తున్నారో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపించారు. దీంతో సీఎస్‌కే వారు జట్టు సభ్యులకోసం బిర్యానీ చేశారంటూ రహస్యాన్ని బయటపెట్టింది.

Updated Date - 2021-04-12T21:49:30+05:30 IST