కారణం లేకుండా.. రూ. 12.5 కోట్లు వదులుకుంటారా ?

ABN , First Publish Date - 2020-09-03T09:46:18+05:30 IST

‘బలమైన కారణం లేకుండా ఎవరైనా రూ. 12.5 కోట్లు వదులుకుంటారా..?’ చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు సీనియర్‌ ఆటగాడు

కారణం లేకుండా..  రూ. 12.5 కోట్లు వదులుకుంటారా ?

ఈ ఐపీఎల్‌లో నన్ను చూస్తారు జూ సీఎ్‌సకేను చూసి ఓర్వలేకే ఆ వార్తలు: రైనా


న్యూఢిల్లీ: ‘బలమైన కారణం లేకుండా ఎవరైనా రూ. 12.5 కోట్లు వదులుకుంటారా..?’ చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు సీనియర్‌ ఆటగాడు సురేశ్‌ రైనా వేసిన ప్రశ్న. రూ. 12.5 కోట్ల విలువైన ఆటగాడు రైనా ఐపీఎల్‌ నుంచి హఠాత్తుగా వైదొలగి భారత్‌కు తిరిగి రావడంతో రకరకాల ఊహాగానాలు చేశారు. కోట్లాది రూపాయలు వదులుకోవడం పిచ్చిపనని కొందరు వ్యాఖ్యానించారు. అంతేకాదు..హోటల్‌ గది బాగాలేనందునే వచ్చాడని కూడా వార్తలొచ్చాయి. వాటన్నింటికీ రైనా బుధవారం బదులిచ్చాడు. ‘స్వదేశం తిరిగి రావాలన్నది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. కుటుంబం కోసమే అలా చేశా. ఇంట్లో తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలు కొన్ని ఏర్పడ్డాయి. సీఎ్‌సకే నా కుటుంబం వంటిది. మహీ భాయ్‌ నాకు చాలా ముఖ్యుడు.


అయినా స్పష్టమైన కారణం లేకుండా ఎవరైనా రూ. 12.5 కోట్లు వదులుకుంటారా’ అని రైనా ప్రశ్నించాడు. సీఎ్‌సకే యజమాని శ్రీనివాసన్‌ తనకు తండ్రిలాంటి వారని తెలిపాడు.‘ఆయన నన్ను తన చిన్న కుమారుడిలా చూశారు. అయినా నేను ఎందుకు తప్పుకొన్నానో కారణాలు తెలియక ఆయన అలా వ్యాఖ్యానించి ఉంటారు’ అన్నాడు.  ‘అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైరై ఉండొచ్చు. కానీ సీఎ్‌సకేకు మరో నాలుగైదేళ్లు ఆడతా’ అని ఓ ప్రశ్నకు రైనా జవాబిచ్చాడు. అంతేకాదు..ఈ ఐపీఎల్‌లో దుబాయ్‌లో తనను చూసే అవకాశాలున్నాయని కూడా చెప్పాడు.


దుబాయ్‌లో ఏర్పాటు చేసిన బయోబబుల్‌తో తాను అసౌకర్యంగా ఉన్నాననడంపై..‘ఇంట్లో నాకు కుటుంబం ఉంది. నాకేమైనా అయితే వారి పరిస్థితి ఏమిటన్న ఆందోళన నన్ను వెంటాడింది. అలాగే నా బంధువులపై భయానక దాడి జరిగింది. అయినా నాకు కుటుంబం ముఖ్యం’ అని రైనా వివరించాడు. తనకు కేటాయించిన హోటల్‌ గది నచ్చలేదన్న విషయంపై ‘అవన్నీ కట్టుకథలు. సీఎ్‌సకే విజయాలు చూసి ఓర్వలేక కొందరు పనిగట్టుకుని చేసిన పుకార్లు అవి’ అని రైనా ఆగ్రహం ప్రకటించాడు.  


రైనా కొడుకులాంటివాడు..

దుబాయ్‌లో రైనా వ్యవహరించిన తీరుపై శ్రీనివాసన్‌ గుర్రుగా ఉన్నాడని వార్తలు వెలువడ్డాయి. కానీ రైనా తనకు కొడుకులాంటివాడని శ్రీనివాసన్‌ చెప్పాడు. ‘అతడిని నేను కొడుకులా భావించా. ఐపీఎల్‌లో సీఎ్‌సకే ఇంతగా విజయవంతం అయిందంటే అందుకు జట్టు యాజమాన్యం క్రికెట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే కారణమ’ని శ్రీని  గుర్తు చేశాడు.

Updated Date - 2020-09-03T09:46:18+05:30 IST