బాబుల్‌రెడ్డి ఆత్మహత్య కేసులో...సురేష్‌కుమార్‌రెడ్డి అరెస్టు

ABN , First Publish Date - 2020-08-10T11:17:16+05:30 IST

కూతురు కాపురంపై కలత చెంది తండ్రి ధనిరెడ్డి బాబుల్‌రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డగా, ఈ కేసులో మృతుడి అల్లుడు

బాబుల్‌రెడ్డి ఆత్మహత్య కేసులో...సురేష్‌కుమార్‌రెడ్డి అరెస్టు

ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 9 : కూతురు కాపురంపై కలత చెంది తండ్రి ధనిరెడ్డి బాబుల్‌రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డగా, ఈ కేసులో మృతుడి అల్లుడు సురేష్‌కుమార్‌రెడ్డిని రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఐ విశ్వనాధరెడ్డి వివరాలను వెల్లడించారు. బాబుల్‌రెడ్డి తన పెద్దకూతురు శ్వేతను తాళ్లమాపురం గ్రామానికి చెందిన సురేష్‌కుమార్‌రెడ్డికి ఇచ్చి గత ఏడాది మేలో వివాహం జరిపించాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరునని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా కూతురుని వేధించడం తదితర కారణాలతో బాబుల్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


తన చావుకు అల్లుడు సురేష్‌కుమార్‌రెడ్డినే కారణమని, కఠినంగా శిక్షించాలని వీడియో తీసి పంపినట్లు సీఐ తెలిపారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమార్తెలు శ్వేత, సాయిప్రీతిలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా బాబుల్‌రెడ్డి ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆదివారం ఖాదరాబాదు వద్ద సురేష్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ రిమాండుకు అదేశించినట్లు సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2020-08-10T11:17:16+05:30 IST