Suresh Kavya మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు: ఎస్పీ

ABN , First Publish Date - 2022-05-10T00:44:00+05:30 IST

జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో కావ్య అనే యువతిపై యువకుడు సురేష్ రెడ్డి తుపాకితో కాల్పులు జరిపారు

Suresh Kavya మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు: ఎస్పీ

నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో కావ్య అనే యువతిపై యువకుడు సురేష్ రెడ్డి తుపాకితో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో యువతి మృతి చెందింది. తర్వాత తనను కాల్చుకుని సురేష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. సురేష్‌రెడ్డి, కావ్య మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని ఎస్పీ విజయరావు తెలిపారు. సురేష్‌రెడ్డి తరచూ కావ్యను వేధించేవాడని పేర్కొన్నారు. గతనెలలో పెళ్లి సంబంధం కోసం బంధువులను పంపాడని, సురేష్‌రెడ్డితో పెళ్లికి కావ్య నిరాకరించిందన్నారు. కోపంతో కావ్యపై సురేష్ రెండు రౌండ్ల కాల్పులు జరిపాడని ఎస్పీ వెల్లడించారు. తొలిరౌండ్ కాల్పుల నుంచి కావ్య తప్పించుకుందని, రెండో రౌండ్‌లో కావ్య తలలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని వివరించారు. అడ్డొచ్చిన కావ్య సోదరిని తోసి కాల్పులు జరిపాడని తెలిపారు. తుపాకీపై మేడ్ ఇన్ యూఎస్ఏ అని ఉందని వెల్లడించారు. సురేష్‌కు తుపాకీ ఎలా వచ్చిందని ఆరా తీస్తున్నామని ఎస్పీ విజయరావు తెలిపారు.

Read more