Jun 22 2021 @ 13:09PM

వ్యాక్సిన్స్ పేరుతో నిర్మాత సురేశ్‌బాబుకి షాక్‌

కొవిడ్ వ్యాక్సిన్స్ పేరుతో టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ నిర్మాత డి.సురేశ్‌బాబుకి ఓ కేటుగాడు షాకిచ్చాడు. వివ‌రాల్లోకి వెళితే.. కొవిడ్ సెకండ్ వేవ్ స‌ద్దుమ‌ణుగుతున్న నేప‌థ్యంలో ప‌లువురు త‌మ వ‌ద్ద ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు కొవిడ్ వ్యాక్సిన్స్‌ను ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో డి.సురేశ్‌బాబు కూడా త‌న స్టాఫ్‌కు కొవిడ్ వ్యాక్సిన్స్ ఇప్పించాల‌నుకున్నారు. అదే స‌మ‌యంలో ఓ కేటుగాడు సురేశ్ బాబు ఆఫీస్‌కి ఫోన్ చేసి త‌న వ‌ద్ద కొవిడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయ‌న్నాడు. ఆ మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మిన మేనేజ‌ర్‌..స‌ద‌రు వ్య‌క్తి అకౌంట్‌కి ల‌క్ష రూపాయ‌లు ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడు. ఆ త‌ర్వాత ఎన్ని సార్లు కాల్ చేసి రిప్ల‌య్ లేక‌పోవ‌డంతో జ‌రిగిన మోసాన్ని గ్ర‌హించిన సురేశ్ బాబు మేనేజ‌ర్ జూబ్లీహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.