కరోనా ఎఫెక్ట్: సూరత్ వస్త్ర పరిశ్రమలకు రూ.1000కోట్ల నష్టం

ABN , First Publish Date - 2020-05-12T16:21:26+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల సూరత్ వస్త్ర పరిశ్రమలరంగానికి రూ.1000కోట్ల నష్టం వాటిల్లింది....

కరోనా ఎఫెక్ట్:  సూరత్ వస్త్ర పరిశ్రమలకు రూ.1000కోట్ల నష్టం

సూరత్ (గుజరాత్): దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల సూరత్ వస్త్ర పరిశ్రమలరంగానికి రూ.1000కోట్ల నష్టం వాటిల్లింది. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వస్త్రపరిశ్రమకు వెయ్యికోట్లరూపాయల నష్టం వాటిల్లిందని దక్షిణ గుజరాత్ టెక్స్ టైల్స్ ప్రాసెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీతూభాయ్ వఖారియా చెప్పారు. దేశంలో లాక్ డౌన్ ను కొనసాగించనున్న నేపథ్యంలో వస్త్ర పరిశ్రమల రంగానికి వచ్చిన నష్టం పెరిగే అవకాశముందని జీతూభాయ్ చెప్పారు. సూరత్ నగరంలోని వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతీ ఏటా 200 కంటెయినర్లలో పత్తి నూలు చైనాకు ఎగుమతి అయ్యేది. కరోనా కారణంగా పత్తి నూలు ఎగుమతి నిలిచి పోయింది. కరోనా వల్ల సూరత్ తోపాటు తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ లో కూడా హౌజౌరీ రంగం సంక్షోభంలో పడింది. 

Updated Date - 2020-05-12T16:21:26+05:30 IST