కరోనా కల్లోలం: చెత్తనెత్తే వాహనంలో వెంటిలేటర్లు!

ABN , First Publish Date - 2021-04-06T11:49:35+05:30 IST

దేశానికి గుజరాత్ మోడల్ అంటూ ప్రగల్భాలు పలికే...

కరోనా కల్లోలం: చెత్తనెత్తే వాహనంలో వెంటిలేటర్లు!

అహ్మదాబాద్: దేశానికి గుజరాత్ మోడల్ అంటూ ప్రగల్భాలు పలికే ఆ రాష్ట్రప్రభుత్వ డొల్లతనం బయటపడింది. గుజరాత్‌లోని సూరత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. అయితే ఇక్కడ విచిత్రమైన విషయమేమంటే వెంటిలేటర్ల తీసుకువచ్చేందుకు సూరత్ మున్సిపాలిటీ చెత్తనెత్తే వాహనాన్ని వినియోగించింది. గుజరాత్‌లో వరుసరగా రెండవ రోజు 2,800 పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. సూరత్‌లో గతంలో కన్నా అధికంగా 724 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికితోడు సూరత్ సివిల్ ఆసుపత్రిలో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. 


వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వల్సాడ్ పట్టణం నుంచి 34 వెంటిలేటర్లు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. సరిగ్గా అప్పుడే ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సూరత్ మున్సిపాలిటి ఆ 34 వెంటిలేటర్లను తీసుకువచ్చేందుకు చెత్తనెత్తే వాహనాన్ని పంపింది. ఈ వాహనంలో వెంటిలేటర్లు వస్తున్న దృశ్యాన్ని చూసినవారంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయమై మీడియా అధికారులను ప్రశ్నించగా, మౌనమే సమాధానంగా నిలిచింది. 

Updated Date - 2021-04-06T11:49:35+05:30 IST