ముంబై: దేశంలో పెట్రోల్, గ్యాస్, నిత్యవసర ధరలు పెరగకుండా ఉండాలంటే ప్రతి నెల ఎన్నికలు ఉండాలని పార్లమెంట్ సభ్యులు, ఎన్సీపీ నేత సుప్రియా సూలె అన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలపై బుధవారం ఆమె మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ‘‘మన దేశంలో ధరల నియంత్రణను అడ్డుకునేవి కేవలం ఎన్నికలు మాత్రమే. ధరలు పెరగొద్దంటే ప్రతి నెల ఎన్నికలు పెట్టాలి. లేదంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర ధరలు పెరుగుతూనే ఉంటాయి’’ అని సుప్రియా సూలె అన్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్రం పెంచిన ధరలపై నిరసనగా మంగళవారం పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వాక్ ఔట్ చేశారు. కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, ఎన్సీపీ సహా ఇతర విపక్షాలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెంచిన ధరలను వెంటనే సవరించాలని, ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీల ఎన్నికలు ముగిసిన అనంతరం ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్/డీజిల్‌పై 80 పైసలు, గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలు కేంద్రం పెంచింది.
ఇవి కూడా చదవండి