సుప్రీం ఆదేశాలు పాటిస్తూ సంరక్షణాలయాలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-04-13T05:52:30+05:30 IST

జిల్లాలో సంరక్షణాల యాలు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తూ నిర్వహించాల ని, జిల్లా మహిళ శిశుసంక్షేమాధికారిణి సంధ్యారాణి పేర్కొన్నారు.

సుప్రీం ఆదేశాలు పాటిస్తూ సంరక్షణాలయాలు నిర్వహించాలి

డీడబ్లూవో సంధ్యారాణి

ఖానాపురంహవేలి, ఏప్రిల్‌12: జిల్లాలో సంరక్షణాల యాలు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తూ నిర్వహించాల ని, జిల్లా మహిళ శిశుసంక్షేమాధికారిణి సంధ్యారాణి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని బాలరక్షాభవన్‌, బాలల పరిరక్షణ కమిటీ బాలల సంరక్షణాలయాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు, కొవిడ్‌ నిబందనలు అనుసరించి సందర్శకులను సంరక్షణాలయాల ప్రాంగణంలోకి అనుమతించరాదని, బాలల పరిరక్షణ కమిటీ ఆదేశానుసారం పిల్లలకు కొవిడ్‌ పరీక్ష తప్పనిసరి చేయించిన అనంతరం సంరక్షణాలయాల్లకి తీసుకోవాల నిసూచించారు. పిల్లల వివరాలు కాని, వారిని చూపిస్తూ దాతలు దగ్గర కాని ఇతరుల వద్దకాని డొనేష న్ల రూ పంలో తీసుకోరాదని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి విష్నువందన, బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ గుంటుపల్లి భారతి, సభ్యులు మచ్చా అనిత, దండా లింగయ్య, లక్ష్మయ్య  సంరక్షణాలయాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T05:52:30+05:30 IST