జోక్యం చేసుకోం: Shaheen bagh కూల్చివేతపై Supreme

ABN , First Publish Date - 2022-05-09T21:38:56+05:30 IST

షహీన్‌ బాఘ్‌కు ఉదయమే పెద్ద ఎత్తున బుల్డోజర్లు, పోలీసులు చేరుకున్నారు. అయితే బుల్డోజర్లను స్థానికులు అడ్డుకున్నారు. ఎస్‌డీఎంసీ ఆదేశాలను వ్యతిరికిస్తూ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు..

జోక్యం చేసుకోం: Shaheen bagh కూల్చివేతపై Supreme

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని Shaheen bagh ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్ విచారణకు తీసుకోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతే కాకుండా ఈ విషయంతో తాము జోక్యం చేసుకోమని, ఏదైనా ఉంటే ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. షహీన్‌ బాఘ్‌లోని కలింది కుంజ్, జామియా నగర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సోమవారం ఉదయం South Delhi Municipal Corporation అధికారులు బుల్డోజర్లతో షహీన్ బాఘ్ చేరుకున్నారు. కాగా, దీనిని నిరసిస్తూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ణప్తి చేశారు.


షహీన్‌ బాఘ్‌కు ఉదయమే పెద్ద ఎత్తున బుల్డోజర్లు, పోలీసులు చేరుకున్నారు. అయితే బుల్డోజర్లను స్థానికులు అడ్డుకున్నారు. ఎస్‌డీఎంసీ ఆదేశాలను వ్యతిరికిస్తూ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో షహీన్‌ బాఘ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు మహిళలు బుల్డోజర్లకు ఎదురెళ్లడంతో అధికారులు వెనక్కి తగ్గారు. బుల్డోజర్లను అక్కడి నుంచి వెనక్కి పంపించారు. కాగా దాఖలైన పిటిషన్‌పై Supreme court స్పందిస్తూ బాధితులు కాకుండా రాజకీయ పార్టీ పిటిషన్ వేయడం ఏంటని, రాజకీయాలకు అత్యున్నత న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దని మందలించింది.

Read more