ఎమ్మెల్యేల అనర్హత కేసు: సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

ABN , First Publish Date - 2020-07-07T14:20:17+05:30 IST

శాసనసభలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేసిన ఉప ముఖ్య మంత్రి ఒ.పన్నీర్‌ సెల్వం సహా

ఎమ్మెల్యేల అనర్హత కేసు: సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

చెన్నై: శాసనసభలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేసిన ఉప ముఖ్య మంత్రి ఒ.పన్నీర్‌ సెల్వం సహా 11 మంది శాసనసభ్యులను పార్టీ ఫిరాయంపుల చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటిం చేలా స్పీకర్‌కు ఆదేశా లివ్వాలని కోరుతూ డీఎంకే దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై ఈ నెల ఎనిమిదిన సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ ప్రారంభించనుంది. శాసనసభలో 2017 ఫిబ్రవరి 18న జరిగిన విశ్వాసపరీక్ష సందర్భంగా అప్పట్లో అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకవర్గంగా వ్యవహరిం చిన పన్నీర్‌సెల్వం (బోడి నాయకనూర్‌), పాండ్యరాజన్‌ (ఆవడి) సెమ్మలై (మేట్టూరు), షణ్ముగనాథన్‌ (శ్రీవైకుంఠం), నటరాజ్‌ (మైలాపూరు), ఆరుకుట్టి (గౌండం పాళయం), చిన్నరాజ్‌ (మేట్టు పాళయం), మనోరంజితం (ఊత్తం గరై), శరవణన్‌ (మదురై సౌత్‌) మాణిక్కం (చోళవందాన్‌), మనోహరన్‌ (వాసు దేవ నల్లూరు)

 

పార్టీ విప్‌ ఉల్లంఘించి మద్దతుగాను, వ్యతిరేకంగాను ఓటు వేయలేదు. పార్టీవిప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన పన్నీర్‌సెల్వం, ఆయన వర్గంలోని 10 మంది శాసన సభ్యులను పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని డీఎంకే శాసనసభ్యుడు చక్రపాణి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇదే రీతిలో అప్పట్లో అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకుడిగా వ్యవహరించిన టీటీవీ దినకరన్‌ అనుచరులు వెట్రివేల్‌, రంగసామి తది తరులు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి అబ్దుల్‌ ఖుదూస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి 2018 ఏప్రిల్‌ 7న స్పీకర్‌ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తీర్పు చెప్పి పిటిషన్లను తోసిపుచ్చింది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆ తీర్పును సవాలు చేస్తూ డీఎంకే శాసనసభ్యుడు చక్రపాణి సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ వేశారు. ఆ అప్పీలుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 11 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలన్న వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోవాలంటూ తాము స్పీకర్‌కు ఎలాంటి గడువు విధించలేమని, ఈ వ్యవహారంలో ఆయనే తగు నిర్ణయం తీసుకుం టారని భావిస్తున్నామని ప్రకటించింది. దీంతో స్పీకర్‌ ధనపాల్‌ ఉప ముఖ్య మంత్రి ఒ. పన్నీర్‌సెల్వం సహా 11 మంది శాసనసభ్యుల నుంచి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు.


అయితే ఓపీఎస్‌ సహా 11 మంది శాసనసభ్యులపై స్పీకర్‌ తగు చర్యలు తీసుకుంటారని సుప్రీం కోర్టు ప్రకటించి మూడు నెలలు దాటడంతో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఓపీఎస్‌ సహా 11 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్‌లో కోరింది. అంతేకాకుండా మణిపూర్‌ శాసనసభలో ఇలాంటి వ్యవహారంలో కొందరు శాసనసభ్యులను స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించిన ఉదంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టుకు డీఎంకే సూచించింది. ఆ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే,  న్యాయమూర్తులు ఎం.ఆర్‌.షా, ఏఎస్‌ గోపన్నాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జూన్‌ 16న వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచా రణ జరిపింది. ఆ సందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ 11 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలన్న వ్యవహారంలో స్పీకర్‌ ధనపాల్‌ చర్యలు తీసుకోకుండా జాప్యం ఎందుకు వహిస్తున్నారంటూ ప్రశ్నిం చింది. ఆ వ్యవహారంపై స్పీకర్‌ ధనపాల్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. ఆ తర్వాత కేసు తదుపరి విచారణను 15 రోజులపాటు వాయిదా వేసింది.


స్పీకర్‌ నోటీసు

ఇదిలా ఉండగా డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై జూన్‌ 16న విచారణ జరగటానికి ముందు రోజు స్పీకర్‌ ధనపాల్‌ 11 మంది ఎమ్యేల్యేలను అనర్హులుగా ప్రకటిం చాలని ఫిర్యాదు చేసిన అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి, ఆర్కేనగర్‌ శాసనసభ్యుడు టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందినవెట్రివేల్‌, తంగతమిళసెల్వన్‌, పార్తీబన్‌, ఎస్‌.రాజా, మురుగుకుమరన్‌ సహా ఏడుగురి నుంచి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో పన్నీర్‌సెల్వం సహా 11 మంది శాసనసభ్యు లను అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం లేదంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి స్పీకర్‌ ధనపాల్‌కు రాసిన లేఖలోని వివరాలు ప్రసారమాధ్యమాల్లో వెల్లడయ్యాయి.  పన్నీర్‌సెల్వం సహా 11 మంది శాసనసభ్యులు ప్రత్యేకవర్గంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్‌ వేసిందని, ప్రస్తుతం వారిని అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం లేదని ఎడప్పాడి ఆ లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం పన్నీర్‌సెల్వం సహా ఆ శాసనసభ్యులు అన్నాడీఎంకే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో వారిపై అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదని స్పీకర్‌కు సూచించారు. ఈ నేపథ్యంలోనే పన్నీర్‌సెల్వం సహా 11 మంది అన్నాడీఎంకే శాసనసభ్యులపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలంటూ డీఎంకే దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై ఈ నెల ఎనిమిది సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది.

Updated Date - 2020-07-07T14:20:17+05:30 IST