న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్కామ్‌పై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. పెగాసస్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, గోప్యత హక్కును కాపాడుకోవడం చాలా ముఖ్యమని సుప్రీం తేల్చి చెప్పింది.