ఏపీ, బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్

ABN , First Publish Date - 2022-01-19T18:32:29+05:30 IST

కరోనా బాధితుల బంధువులకు పరిహారం ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఏపీ, బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్

న్యూఢిల్లీ: కరోనా బాధితుల బంధువులకు పరిహారం ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. అలాగే బీహార్ ప్రభుత్వంపై కూడా ధర్మాసనం సీరియస్ అయింది.


కోవిడ్ బాధితుల పరిహారన్ని వారి బంధువులకు ఏపీ, బీహార్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కరోనా కారణంగా మరణించినవారి కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపుల విషయంలో ఏపీ, బీహార్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం వహించాయి. దీనిపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ముందు హాజరుకావాలని, పరిహారం ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - 2022-01-19T18:32:29+05:30 IST