హైకోర్టుపై నిరాధార ఆరోపణలు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2022-01-05T21:10:23+05:30 IST

సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టుపై నిరాధార ఆరోపణలు చేసిన ఓ పిటిషనర్‌కు...

హైకోర్టుపై నిరాధార ఆరోపణలు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టుపై నిరాధార ఆరోపణలు చేసిన ఓ పిటిషనర్‌కు రూ.25 లక్షల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జరిమానాను జమ చేయాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఈ తరహా కేసుల విషయంలో ఓ హెచ్చరికగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయస్థానం తెలిపింది.


ఉత్తరాఖండ్‌ హైకోర్టుతోపాటు కొందరు ప్రభుత్వ మాజీ అధికారులపై విజయపాల్ సింగ్ అనే వ్యక్తి ‘ఆమోదయోగ్యం’ కాని నిరాధార ఆరోపణలు చేశారని సుప్రీం కోర్టు తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఖాస్గీదేవీ అహిల్యాబాయ్‌ హోల్కర్‌ ఛారిటీస్‌ ట్రస్టుకు సంబంధించిన కేసు విచారణలో సుప్రీం కోర్టు పిటిషనర్ విజయపాల్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. హోల్కర్‌ రాజ వంశానికి చెందిన 246 ధాతృత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్య హక్కులు ఉంటాయని మధ్యప్రదశ్ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును తప్పు బట్టిన పిటిషనర్ విజయపాల్ సింగ్‌కు జరిమానా విధించింది. జరిమాన చెల్లించకపోతే  హరిద్వార్‌ కలెక్టరు అతడి నుంచి ఆ సొమ్మును రాబట్టాలని జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. 

Updated Date - 2022-01-05T21:10:23+05:30 IST