న్యాయవాదులు, పార్టీలు సమ్మతిస్తే ప్రత్యక్ష విచారణపై పరిశీలిస్తాం : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-06-03T01:58:01+05:30 IST

కేసుల విచారణలు ప్రత్యక్షంగా జరగాలని కోరుకునేవారి అభ్యర్థనలను

న్యాయవాదులు, పార్టీలు సమ్మతిస్తే ప్రత్యక్ష విచారణపై పరిశీలిస్తాం : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : కేసుల విచారణలు ప్రత్యక్షంగా జరగాలని కోరుకునేవారి అభ్యర్థనలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. వివాదంలోని పార్టీలు, వారి న్యాయవాదులు ఉమ్మడిగా సమ్మతిస్తూ, ప్రత్యక్ష విచారణను కోరుకున్న తర్వాత మాత్రమే వారి అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపింది. 


కోవిడ్-19 మహమ్మారిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసులపై విచారణలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతున్న సంగతి తెలిసిందే. 


ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. న్యాయవాదులు న్యాయస్థానంలో హాజరయ్యే అవకాశాలను పరిశీలించాలని వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని తెలిపింది. కోర్టుకు హాజరై, వాదనలు వినిపించేందుకు ఇష్టపడుతున్నట్లు తెలియజేస్తూ, న్యాయవాదులు, వివాదంలోని పార్టీలు ఉమ్మడిగా సమ్మతిని తెలియజేస్తే, ప్రత్యక్ష విచారణ చేయడం గురించి పరిశీలిస్తామని తెలిపింది. 


అన్ని పార్టీల సంయుక్త సమ్మతిని స్వీకరించిన తర్వాత మాత్రమే కోర్టు సమక్షంలో విచారణకు పెట్టడంపై పరిశీలిస్తామని తెలిపింది. అయితే ధర్మాసనం అందుబాటులో ఉండటాన్నిబట్టి లిస్టింగ్ చేస్తామని తెలిపింది. కోర్టుకు హాజరయ్యే పార్టీలు, న్యాయవాదులు భౌతిక దూరం నిబంధనలు పాటించాలని పేర్కొంది. 


Updated Date - 2020-06-03T01:58:01+05:30 IST