ఢిల్లీ: ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో కేసు విచారణ ఏ దశలో ఉందనే దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని.. రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ రెండు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.