Nupur Sharma: నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ పిటిషన్.. తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-09-10T02:41:06+05:30 IST

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మ (Nupur Sharma)ను అరెస్ట్

Nupur Sharma: నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ పిటిషన్.. తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మ (Nupur Sharma)ను అరెస్ట్ చేయాలని, స్వత్రంత దర్యాప్తు జరిపించాలంటూ దాఖలపై పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. నుపుర్ శర్మకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్ (UU Lalit  నేతృత్వంలోని ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. 


పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. మాబ్ లించింగ్ నియంత్రణకు సంబంధించి తహసీన్ పొన్నవాలా తీర్పులోని ఆదేశాలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నట్టు తెలిపారు. స్పందించిన న్యాయస్థానం.. ఇది చాలా సరళమైనదిగా, హానికరం కానిదిగా కనిపించొచ్చని, కానీ చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంటుందని పేర్కొంది. ఆదేశాలు జారీ చేసేటప్పుడు కోర్టు చాలా జాగ్రత్తగా ఉండాలని, కాబట్టి ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నట్టు పేర్కొంది. దీంతో పిటిషనర్ దానిని ఉపసంహరించుకున్నారు. 


నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అడ్వకేట్ అబు సోహెల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. స్వతంత్ర, విశ్వసనీయమైన, నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించాలని అందులో కోరారు. కాగా, నుపుర్ శర్మపై గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను ఢిల్లీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసింది. ఢిల్లీ హైకోర్టు నుంచి తగిన పరిష్కారం కోరాలని శర్మకు సూచించింది.

Updated Date - 2022-09-10T02:41:06+05:30 IST