రఘురామకు బెయిల్‌ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు కాపీ విడుదల

ABN , First Publish Date - 2021-05-22T21:43:40+05:30 IST

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్‌ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు కాపీ విడుదల చేసింది. తీర్పు కాపీని లాయర్లు ఆర్మీ

రఘురామకు బెయిల్‌ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు కాపీ విడుదల

హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్‌ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు కాపీ విడుదల చేసింది. తీర్పు కాపీని లాయర్లు ఆర్మీ ఆస్పత్రికి అందజేశారు. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. రఘురామ గాయాలు కూడా మీడియాకు న్యాయస్థానం పేర్కొంది. కస్టడీలో రఘురామకృష్ణరాజు పట్ల పోలీసులు.. అనుచితంగా ప్రవర్తించి ఉండొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రఘురామ పాదాలకు గాయాలు, ఎడమకాలి వేలు ఎముక విరిగినట్లు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నట్లు తీర్పులో కోర్టు తెలిపింది. 10 రోజుల్లోగా లక్ష సొంత పూచీకత్తు సమర్పించి.. బెయిల్‌పై విడుదల కావొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.


రాజద్రోహం ఆరోపణలతో నమోదైన కేసులో సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో రఘురామరాజును కస్టడీలో ఇంటరాగేట్‌ చేయనక్కర్లేదని స్పష్టం చేసింది. అయితే ఆయన దర్యాప్తునకు సహకరించాలని, విచారణాధికారి ఎప్పుడు పిలిచినా స్పందించాలని ఆదేశించింది. అయితే ఆయనకు 24 గంటల ముందు నోటీసులివ్వాలని సీఐడీకి సూచించింది. న్యాయవాది సమక్షంలో ఇంటరాగేషన్‌ చేయాలని ఆదేశించింది. కేసుకు సంబంధించి ఏ అంశంపైనైనా ప్రింట్‌ లేదా విజువల్‌ మీడియాకు ఆయన ఇంటర్వ్వూలు ఇవ్వరాదని.. సాక్షులను ప్రభావితం చేయరాదని.. దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

Updated Date - 2021-05-22T21:43:40+05:30 IST