కేరళ సర్కార్‌ను తీవ్రంగా మందలించిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-07-20T19:09:47+05:30 IST

దేశంలో అత్యధిక కోవిడ్ పాజిటివ్ రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ బక్రీదు‌ సెలబ్రేషన్ల కోసం కోవిడ్..

కేరళ సర్కార్‌ను తీవ్రంగా మందలించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక కోవిడ్ పాజిటివ్ రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ బక్రీదు‌ సెలబ్రేషన్ల కోసం కోవిడ్ నిబంధనలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా అనుచితమని పేర్కొంది. సడలించిన నిబంధనల వల్ల మరింత వైరస్ వ్యాప్తి జరిగితే తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేరళ సర్కార్‌ను అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. లాక్‌డౌన్ నిబంధనలను సడలించాలని వ్యాపారులు చేసిన డిమాండ్‌కు కేరళ సర్కార్ తలవంచడం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.


''పౌరుల జీవించే హక్కు చాలా విలువైనది. ఒత్తిళ్లకు తలవొగ్గి ప్రజల జీవించే హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తోసిరాజనడం కుదరదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనైనా తలెత్తి, ప్రజలు ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకువస్తే అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటా'' అని ధర్మాసనం హెచ్చరించింది. కన్వర్ యాత్ర కేసులో తాము ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించాలని పినరయి విజయన్ సర్కార్‌ను ఆదేశించింది.

Updated Date - 2021-07-20T19:09:47+05:30 IST