పంచాయతీ కార్యాలయాలకు రంగులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-06-04T04:00:53+05:30 IST

ఏపీలో పంచాయతీ కార్యాలయాలకు రంగులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయవ్యవస్థ సమీక్షించవచ్చని ...

పంచాయతీ కార్యాలయాలకు రంగులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఏపీలో పంచాయతీ కార్యాలయాలకు రంగులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయవ్యవస్థ సమీక్షించవచ్చని తెలిపింది. న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పులే ఫైనల్ అని తేల్చి చెప్పింది. న్యాయవ్యవస్థ తీర్పులను ఎవరైనా పాటించాల్సిందేనని ఆదేశించింది. న్యాయవ్యవస్థ తీర్పులను పాటించకపోతే చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు పాటించకపోతే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని పేర్కొంది. పంచాయతీ భవనాలకు రంగులను తొలగించాల్సిందేనని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల్లో ఎటువంటి తప్పు లేదని, తీర్పును క్షుణ్ణంగా పరిశీలించామని వెల్లడించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదని చెప్పింది. రాజకీయ పార్టీలకు చెందిన ఏ రంగునూ ఉపయోగించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2020-06-04T04:00:53+05:30 IST