న్యూఢిల్లీ: ఖైదీలకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. బెయిల్ మంజూరైన వెంటనే విడుదలయ్యేలా ఫాస్టర్ విధానం అమలుకు సుప్రీం ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఖైదీల విడుదల చేసేలా సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశించింది. కోర్టులు బెయిల్ మంజూరీ చేసినా సాంకేతిక కారణాలతో ఖైదీల విడుదలలో జాప్యంపై సుమోటోగా కేసు నమోదు అయింది. విచారణను చేపట్టిన సుప్రీం ధర్మాసనం..అన్ని జైళ్లలో ఇంటర్నెట్ సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎస్‌లకు ఆదేశించింది. నోడల్ ఏజెన్సీ ద్వారా ఫాస్టర్ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. ఫాస్టర్ విధానం ద్వారా ఇకపై మెయిల్లో సంబంధిత జైళ్లకే బెయిల్ ఉత్తర్వులు చేరనున్నాయి.