రాజద్రోహం చట్టం 124A అమలుపై Supreme court స్టే

ABN , First Publish Date - 2022-05-11T18:18:45+05:30 IST

న్యూఢిల్లీ: రాజద్రోహం చట్టం 124A అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు

రాజద్రోహం చట్టం 124A అమలుపై Supreme court స్టే

New delhi: రాజద్రోహం చట్టం 124A అమలుపై సుప్రీంకోర్టు (Supreme court) స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. అంతే కాదు.. ఇప్పటికే నమోదైన కేసులపై చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతూల్యతను పాటించాల్సిన అవసరం కూడా ఉందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. 124A సెక్షన్ కింద జైల్లో ఉన్నవారు సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చునని సూచించింది.


కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు..124A సెక్షన్‌ కింద ప్రభుత్వాలు కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. ABN ఆంధ్రజ్యోతిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ మేరకు ప్రస్తావించింది. హనుమాన్‌ చాలీసా పఠించినప్పుడు 124A కింద..కేసులు నమోదు చేయడాన్నిఅటార్నీ జనరల్‌  తప్పుబట్టారు. పిటిషనర్లు కూడా ఇది వలసవాద చట్టంగా పేర్కొన్నారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Read more