తిరుమల: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు.వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.అలాగే ఆర్బీఐ డైరెక్టర్ బి.సుధ బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.