నిర్భయ కేసులో విచారణ సందర్భంగా అస్వస్థతకు గురైన జడ్జి

ABN , First Publish Date - 2020-02-14T21:39:46+05:30 IST

నిర్భయ కేసులో దోషుల ఉరిపై తీర్పును చదువుతూ సుప్రీం కోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ ఆర్. భానుమతి

నిర్భయ కేసులో విచారణ సందర్భంగా అస్వస్థతకు గురైన జడ్జి

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరిపై తీర్పును చదువుతూ సుప్రీం కోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ ఆర్. భానుమతి కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన కోర్టు హాలులో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను జస్టిస్ భానుమతి ధర్మాసనం విచారిస్తోంది. పటిషన్ విచారణ సందర్భంగా ఆమె స్పృహ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన కోర్టు సిబ్బంది ఆమెకు ప్రాథమిక వైద్యం అందించారు. కొద్దిసేపటికి ఆమె తేరుకుని స్పృహలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను వచ్చేవారానికి వాయిదా వేశారు. అయితే తీర్పు మాత్రం త్వరగా వెల్లడిస్తామన్నారు. 


ఘటనపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. జస్టిస్ భానుమతి అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అయినా కోర్టుకు వచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారన్నారు. 

Updated Date - 2020-02-14T21:39:46+05:30 IST