బట్టబాతుల సంరక్షణ కోసం పిల్

ABN , First Publish Date - 2022-03-03T20:50:37+05:30 IST

ప్రపంచంలోనే అరుదైన పక్షి జాతుల్లో ఒకటైన బట్టబాతు (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్‌పై గురువారం విచారణ జరిపిన కోర్టు దీనికి అంగీకరిస్తూ, కేంద్రానికి సూచనలు చేసింది.

బట్టబాతుల సంరక్షణ కోసం పిల్

ప్రపంచంలోనే అరుదైన పక్షి జాతుల్లో ఒకటైన బట్టబాతు (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్‌పై గురువారం విచారణ జరిపిన కోర్టు దీనికి అంగీకరిస్తూ, కేంద్రానికి సూచనలు చేసింది. కొందరు ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లు వేసిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. ఈ పక్షులు అరుదైనవని, గుజరాత్, రాజస్థాన్‌లో మాత్రమే కనిపించే ఇవి ఇప్పుడు 90 శాతం అంతరించాయని, మిగిలిన వాటినైనా సంక్షించాలని పిటిషన్ దారులు కోరారు. వీటిని సంరక్షించేందుకు ఇవి ఉండే ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ కేబుళ్లను తొలగించి, భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేయాలని కోరారు. దీనికి కారణం ఉంది. బట్టబాతులు అత్యంత బరువైన, ఎగరగలిగే పక్షులు. అయితే, వీటికి కంటిచూపు తక్కువగా ఉంటుంది. దీంతో వేగంగా ఎగురుతూ, గాలిలో ఉన్న కేబుళ్లను ఢీకొనడం వల్ల చాలా పక్షులు చనిపోతున్నాయి. దీంతో వీటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అందుకే భూగర్భ కేబుళ్లు వేయాలని పిటిషనర్లు కోరారు. అలాగే ఇవి ఉండే ప్రదేశాలలో వేటాడేందుకు అనుకూలించకుండా, ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అధికారుల పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు ఈమేరకు సూచనలు చేసింది.

Updated Date - 2022-03-03T20:50:37+05:30 IST